ప్రజా సేవలో ఎస్ హెచ్ వో ప్రస్థానం..


ఫౌండర్ అండ్ చైర్మన్. డాక్టర్ టి. సేవకుమార్ జీవిత విశేషాలు

  • ఆంధ్ర ప్రదేశ్ లోని అప్పటి గుంటూరు జిల్లా ఇప్పటి బాపట్ల జిల్లా… బాపట్లలో 1968లో శ్రీ తాతా నాగేంద్రరావు, కనకదుర్గ దంపతుల ప్రథమ సంతానం. తండ్రి వృత్తి రీత్యా న్యాయవాది. బాపట్లలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా పనిచేసే అత్యంత నిజాయితీపరులుగా పేరు గడించారు.
  • ఐదో తరగతి వరకు అప్పటి పశ్చిమగోదావరి జిల్లా, ఇప్పటి ఏలూరు జిల్లా లోని ఆముదాల చిలుక గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలోనూ, ఏడో తరగతి వరకు సమీప గ్రామమైన మల్లాయిగూడెం ప్రాథమికోన్నత పాఠశాలలోను,పదో తరగతి వరకు చింతలపూడిలో గల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యనుభ్యసించారు.
  • ఇంటర్మీడియట్ బైపిసి గ్రూపులో బాపట్ల జిల్లా, బాపట్లలోని బాపట్ల ఆర్ట్స్ అండ్ సైన్సెస్ కళాశాలలో పూర్తి చేశారు.
  •  గుంటూరు వైద్య కళాశాల నుండి 1995లో ఎం.బి., బి.ఎస్., పట్టా పొందారు.
  • ఒక సంవత్సరం పాటు గుంటూరు లోని సెయింట్ జోసెఫ్ జనరల్ హాస్పిటల్లో రెసిడెన్షియల్ మెడికల్ ఆఫీసర్ గా పనిచేశారు.
  •  వైద్యం వ్యాపారమైపోతున్న నేపథ్యంలో, ఆవేదనతో తన వంతు కర్తవ్యం గా ప్రజలకు అతి తక్కువ ఖర్చుకి వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో 1996 నవంబర్ 14వ తేదీన గుంటూరులోని 2/1 బ్రాడీపేటలో సర్వీస్ హెల్త్ ఆర్గనైజేషన్ (ఎస్.హెచ్.ఒ) సంస్థను స్థాపించారు. ఒక పైసా కూడా నిధులు, విరాళాలు స్వీకరించకుండా ఈ సంస్థ ద్వారా ఉచిత వైద్య సలహాలు, అతి తక్కువ ఖర్చుకి వ్యాధి నిర్ధారణ పరీక్షలు, మందులు అందిస్తున్నారు.
  • 1996 నుండి ఈరోజు వరకు ఏ విధమైన వైద్యసేవల రేట్లను ఒక్కసారి కూడా పెంచలేదు. 2024లో కూడా 1996 లోని రేట్ల తోనే వైద్య సేవలు అందించడం
    జరుగుతుంది.
  •  ఎం.బి.,బి.యస్., డిగ్రీని ఏనాడు సంపాదన కోసం ఉపయోగించలేదు. ఆనాటి నుండి నేటి వరకు పూర్తిగా ఉచిత వైద్య సలహాలు అందజేస్తున్నారు. ఇప్పటివరకు నగరంలో ప్రజా ప్రయోజనార్థం 2500 పైగా ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించారు.
    9. 1997 నుండి బి.పి, షుగర్ బాధితులకు ఎస్.హెచ్.ఒ హైపర్ టెన్షన్ అండ్ డయాబెటిక్ క్లబ్ ద్వారా అతి తక్కువ ఖర్చుకి వ్యాధి నిర్ధారణ పరీక్షలు, జనరిక్ మందుల అందిస్తూ, ప్రతినెలా స్పెషలిస్టులతో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తూ వారి నేలసరి వైద్య ఖర్చును సగానికి సగం తగ్గించి విశేష ప్రజాదరణ పొందారు.
  • ప్రజారోగ్య చైతన్యమే లక్ష్యంగా 11 సంవత్సరాల పాటు” హెల్త్ హెల్ప్” మాసపత్రికకు సంపాదకత్వ బాధ్యతలు నిర్వహిస్తూ నడిపారు. పత్రికను ఇండియన్ పోస్టల్ డిపార్ట్ మెంట్ మార్కెటింగ్ చేసింది.
  • ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన, కె.జి. బేసిన్ లోని చమురు, గ్యాస్ నిక్షేపాల ఆదాయంలో 12వ ఆర్ధిక సంఘం సూచించిన విధంగా ఆంధ్రప్రదేశ్ వాటా 50 శాతం సాధన, అవినీతి వ్యతిరేక ఉద్యమాలలో కీలక పాత్ర పోషించారు, పోషిస్తున్నారు.
  • సంస్థ సేవల్ని నిజాయితీని, నిబద్ధతను గుర్తించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 1998లో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి సంఘం” సభ్యునిగా నియమించింది. రెండుసార్లు ఆ పదవీకాలం పొడిగించడం విశేషం. కేంద్ర ప్రభుత్వ సంస్థ ఆయన “జన శిక్షణ సంస్థాన్ మేనేజ్ మెంట్ బోర్డు”లో సభ్యులుగా రెండుసార్లు పనిచేశారు.
  • రాష్ట్ర ప్రభుత్వం 1997 వ సంవత్సరంలో జిల్లా యూత్ అవార్డుతో సత్కరించింది. అనేక రాష్ట్ర, జాతీయ స్థాయి అవార్డులు అందుకున్నారు.
  • ప్రస్తుతం బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీ పాలకవర్గంలోను, మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) నేషనల్ కౌన్సిల్లో సభ్యులుగా ఉన్నారు. 15. రాజ్యాంగ చర్చా వేదిక (సిడిఎఫ్), జై ఆంధ్ర డెమోక్రటిక్ ఫోరం (జెడిఎఫ్) సంస్థలలో సంయుక్త కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు.
  • డాక్టర్ ఇ.వి.నారాయణ (ఫార్మర్, ప్రిన్సిపాల్, టి.జె.పి.యస్ కళాశాల) చైర్మన్ గా గల కౌండిన్య ఎడ్యుకేషనల్ ట్రస్ట్, వెనిగండ్ల దగ్గర గల కౌండిన్య పురంలో నిర్మించిన కౌండిన్య ఐ.ఏ.యస్ అకాడమీ లలో వ్యవస్థాపక సంయుక్త కార్యదర్శిగా, సలహాదారునిగా కీలక పాత్ర పోషిస్తున్నారు.
  • లోక్ సత్తా పార్టీలో రాజకీయ రంగ జీవితం ప్రారంభించి, ఆ తర్వాత అవినీతి వ్యతిరేక ఉద్యమంలో ముందుకొచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) లో సాధారణ కార్యకర్తగా ప్రవేశించి, రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా, రాష్ట్ర సెక్రటరీగా, రాష్ట్ర అధికార ప్రతినిధి గా, ప్రస్తుతం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా సేవలందిస్తున్నారు. 2014, 2019 ఎన్నికల లోగుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుండి ఎం.ఎల్.ఎ అభ్యర్ధి గా పోటి చేసారు. ప్రస్తుతం గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఇన్ ఛార్జ్ గా వ్యవహరిస్తున్నారు.
  • 2020లో SHOAP-TV యూట్యూబ్ ఛానల్ ను ప్రారంభించి, ప్రజల సమస్యలు, పరిష్కారాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. సంస్థ ప్రారంభం నుండి స్వచ్ఛందంగా నిర్వహిస్తున్న హెచ్ఐవి, హెపటైటిస్ బి, క్యాన్సర్ పరీక్షలు కౌన్సిలింగ్, శాస్త్రీయ సమాచార కేంద్రం ప్రజలకు వరంగా మారింది.
  • 1992లో ” ఎయిడ్స్ వ్యాధి” పై రచించిన పుస్తకం ఎంతో ప్రచాదరణ పొందింది. 2020లో కరోనా పై రచించిన పుస్తకం ప్రజలకు ఎంతో శాస్త్రీయ విజ్ఞానాన్ని అందించింది. ఇటీవల రచించిన డయాబెటీస్- హైపర్ టెన్షన్, రక్తమార్పిడి పుస్తకాలు ప్రజల్లో ఎంతో ప్రాచుర్యం పొందాయి.
  • విద్య, వైద్యం పౌష్టికాహారం సమాజంలో ఎవరికి ఆర్థిక భారం కారదనే లక్ష్యసాధన కోసం నిరంతర ప్రజా చైతన్య కార్యక్రమాలు, అవినీతి రహిత సమాజ నిర్మాణం కోసం నిర్విరామ పోరాటం సాగిస్తున్నారు. అందుకు జీవితం అంకితం అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *