సర్వీస్ హెల్త్ ఆర్గనైజేషన్ ( ఎస్ .హెచ్ ఓ)1996 నవంబర్ 14 న అంటే… రిజిస్టర్ చేసిన రోజునే… తొలుత గా ఉచిత క్లినిక్ ను ప్రారంభించింది. ఆ రోజే ఈ క్లినిక్ ద్వారా ఉచిత వైద్య సలహాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం, ఆ రోజు నుండి నేటి వరకు ఆ నిర్ణయం కు కట్టుబడి ఉండడం జరిగింది . జరుగుతుంది. నా ఎం.బి.బి.ఎస్ సర్టిఫికెట్ ను, ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ లో రిజిస్ట్రేషన్ కు, క్లినిక్ రిజిస్ట్రేషన్ కు ఉపయోగపడింది. ఫీజుల రూపంలో డబ్బు సంపాదనకు ఏనాడు వినియోగించలేదు. కరోనా సమమంలో ఫోన్ ద్వారా ఉచిత వైద్య సేవలు విస్తృతంగా అందించడం జరిగింది. ఆన్ లైన్ లో కొన్ని సంస్థలు ఫీజు ఆఫర్ చేసిన తిరస్కరించడం జరిగింది.
ఎం.బి.బి.ఎస్ సర్టిఫికెట్ పూర్తిగా ప్రజలకే అంకితం. అందులో మార్పు లేదు. ఉచిత వైద్య సలహాలకు పూర్తిగా కట్టుబడి ఉన్నాను. స్పెషలిస్టుల వైద్య సలహాలు, చికిత్సలు అవసరమైన వారిని, వారి ఇష్టప్రకారం రిఫర్ చేయడం జరుగుతుంది. అక్కడ కూడా నా సహకారం అవసరమైతే అందించడం జరుగుతుంది.
